పాషా,నరహరి ఆశయ సాధనకు పోరాడాలి
పాషా, నరహరి ఆశయాల సాధనకు పోరాడాలి
సీపీఎం నాయకుల పిలుపు
ఆరుట్ల లో పాషా నరహరిల 37వ వర్ధంతి
మంచాల : కామ్రేడ్లు మహబూబ్ పాషా, నరహరి ఆశయాల సాధనకు నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. వారి 37వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆరుట్ల గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మంచాల మండల కార్యదర్శివర్గ సభ్యుడు మార బుగ్గ రాములు, మండల కమిటీ సభ్యుడు పుల్లగల్ల గోపాల్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన నాయకులను కాంగ్రెస్, బీజేపీ గూండాలు దారికాచి హత్య చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నా పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. భూసమస్యలు, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయడమే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు కొండిగారి బుచ్చయ్య, బోయపల్లి అంజయ్య, చిందం బీరప్ప, నక్క మల్లేష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు యూసఫ్ అలీ, కొండిగారి శంకరయ్య, బడ్డు విజయ్, జోగు శేఖర్, సాతిరి సత్తయ్య, అనుపాటి గణేష్, ఎర్పుల వీరేష్, సాతిరి నర్సింగ్‌రావు, కొండిగారి ప్రసాద్, ఎండీ జావీడ్, ఆర్ల వెంకటేష్, అలవాల భాస్కర్, ఎండీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల