BREAKING
వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్ రూపురేఖలు మారుస్తా లాంటి బడా హామీ ఇవ్వలేను_ --- చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉంటా ---ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉంటాయి ---అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపు తెస్తా ---ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ 100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం!

Select Suryaa Now
శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం!

రూ.1.34 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

శంషాబాద్: తెలంగాణలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపుతోంది. నకిలీ నోట్లను సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై సందీప్ అనే వ్యక్తిని శంషాబాద్ పరిధిలోని పెద్ద షాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.1.34 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ నోట్లు ఎక్కడ తయారయ్యాయి? వీటిని ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారం వెనుక మరికొందరి ప్రమేయం ఉందా? నకిలీ నోట్ల తయారీ, సరఫరా నెట్‌వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నకిలీ కరెన్సీ చలామణి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, పోలీసులు వెల్లడించే అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ శంషాబాద్.