BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నేషనల్ బీసీదళ్ అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ

Select Suryaa Now
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  నేషనల్ బీసీదళ్ అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ

హైదరాబాద్, మేజర్ న్యూస్:దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలందరికీ నేషనల్ బీసీ దళ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. సమాజంలో కులమతాలకు అతీతంగా ఐక్యత, సోదరభావం, సమానత్వం, మానవత్వం పరిఢవిల్లాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సముచిత అవకాశాలు లభించి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని, ఆనందాన్ని అందరితో పంచుకోవాలని పిలుపునిచ్చారు.