టీయూడబ్ల్యూజే (ఐజేయు) నారాయణపేట జిల్లా అధ్యక్షులు జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం
నారాయణపేట, సూర్యన్యూస్:అన్నదానానికి మించిన గొప్ప దానం మరొకటిలేదని టియుడబ్ల్యూజే (ఐజేయు) నారాయణపేట జిల్లా అధ్యక్షులు కోయిలకొండ నారాయణరెడ్డి అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీసత్యనారాయణ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట సౌజన్యంతో కొనసాగుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం బీద ప్రజలకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వారికి మన వంతు ఉడతా భక్తిగా సేవా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు. నారాయణపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపుగా వంద రోజుల నుంచి మధ్యాహ్నం నిరుపేదలకు భోజనం అందించడం అభినందనీయం అన్నారు. తన జన్మదినం సందర్భంగా నిరుపేదల ఆకలి తీర్చే మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవికుమార్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లయన్ కన్న జగదీష్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జాతీయ కౌన్సిల్ సభ్యులు నక్క శ్రీనివాస్, జిల్లా హెల్త్ కన్వీనర్ సంజీవ ప్రకాష్ ముదిరాజ్, జిల్లా ఎడ్యుకేషన్ కన్వీనర్ రాజేష్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, నాయకులు బోయ శ్రీనివాస్, మహమ్మద్ తఖి, అభిమానులు కథలప్ప, చక్రి పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.