టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ అజార్ హుస్సేన్‌కు ఘన సన్మానం. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
మక్కా పర్యటనను విజయవంతంగా ముగించుకొని నిర్మల్ పట్టణానికి చేరుకున్న టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ అజార్ హుస్సేన్‌కు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అజార్ హుస్సేన్‌కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ తో పాటు, కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అజార్ హుస్సేన్‌కు అభినందనలు తెలిపారు.