BREAKING
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు

తల్లి నా ఆదిలాబాద్.. అడవి తల్లి జిల్లా’ పాటను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
తల్లి నా ఆదిలాబాద్.. అడవి తల్లి జిల్లా’ పాటను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలు, అటవీ సంపద, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సంస్కృతి సంప్రదాయాలు, స్థానిక కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా రూపొందించిన ‘తల్లి నా ఆదిలాబాద్.. అడవి తల్లి జిల్లా’ వీడియో గీతాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించి, తిలకించారు.జిల్లా కళాకారులు, తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు సంయుక్తంగా రూపొందించిన ఈ వీడియో గీతం ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను, ప్రకృతి రమణీయతను, అటవీ వైభవాన్ని ప్రజలకు పరిచయం చేసేలా ఉందని కలెక్టర్ ప్రశంసించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి, అపారమైన అటవీ సంపదకు, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జిల్లాలోని సహజ వనరులు, పర్యాటక ప్రదేశాలు, స్థానిక కళలు, సంస్కృతి వైభవాన్ని వీడియో గీతం రూపంలో ప్రజలకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు.కళలు, సాహిత్యం, సంగీతం ద్వారా ఒక ప్రాంతం యొక్క చరిత్ర, సంస్కృతి, ప్రత్యేకతలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. స్థానిక కళాకారులు తమలోని సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీస్తూ ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా ప్రకృతి అందాలు, అడవుల ప్రాధాన్యత, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసే ఇటువంటి సృజనాత్మక ప్రయత్నాలకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.వీడియో గీతం రూపకల్పనలో భాగస్వాములైన కళాకారులందరినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం జిల్లా కళాకారులు కలెక్టర్ రాజర్షి షాను ఘనంగా సత్కరించగా, కలెక్టర్ సైతం కళాకారులను అభినందించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, డిఆర్ఓ స్రవంతి, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, కళాకారులు దత్తు, రవి, వెంకట్రావు, గోవింద్, శంకర్, రాజలింగు, మురళి, ఆశిష్, నర్సమ్మ, మోహన్ నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.