తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి:
కొల్చారం .…కొల్చారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కొల్చారం మండలంతో పాటు వివిధ మండలాల్లో వరి ధాన్యాన్ని పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు
అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలి.రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు.
బోనస్‌తో పాటు నష్టపరిహారం చెల్లించాలి
రైతుల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయడంతో పాటు, రైతులకు రావాల్సిన బోనస్‌ను అందించి, వర్షాల వల్ల జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ధాన్యపు గింజకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రైతులకు న్యాయం చేయకపోతే రోడ్లపై ధర్నా తప్పదుఈ కార్యక్రమంలో కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్, మండల యువజన అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, కొల్చారం ఉపసర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, మాజీ సర్పంచ్ కరెంట్ రాజా గౌడ్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, సొసైటీ చైర్మన్ మనోహర్, నంగునూరి గౌరీ శంకర్, చిన్న రాములు, కృష్ణ, అంజనిపుత్ర, నేరెళ్ల సత్యనారాయణ, వనమాల రాణి, శ్రీధర్, చింతల కృష్ణ, సాతల్లి షేకులు, పాండ్ర వెంకటేశం, అప్పాజీపల్లి ధనరాజ్, సాయిని సిద్ధిరాములు, రాజేష్, చౌరి గారి భాస్కర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.