స్వగ్రామంలో ఎమ్మెల్యే కుంభం దసరా సందడి*
*సతీమణితో కలిసి జమ్మి పూజ.. గ్రామస్థులకు శుభాకాంక్షలు*
*వలిగొండ మేజర్ న్యూస్*
*విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తన స్వగ్రామమైన వలిగొండలో సతీమణి కిరణ్‌జ్యోతితో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా జమ్మి పూజ నిర్వహించి పండుగ సంబరాలను జరుపుకున్నారు.
విజయదశమి సందర్భంగా జమ్మి పూజ నిర్వహించడం, జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారమని పేర్కొన్నారు. అనంతరం గ్రామానికి చెందిన నాయకులు, ప్రముఖులు, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల మధ్య ఎమ్మెల్యే దసరా వేడుకల్లో పాల్గొనడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. అదేవిధంగా బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన రావణ కాష్టం కార్యక్రమంలో పాల్గొని రావణ దహనం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ గరిసె రవి మండల పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ గౌడ్ పోలేపాక జానకి రాములు నాయకులు పాశం సత్తిరెడ్డి బత్తిని లింగయ్య గౌడ్ కాసుల వెంకన్న గౌడ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు*