BREAKING
ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

సూపర్ లోక్ అదాలత్‌లో రూ.59.48 లక్షల కేసుల పరిష్కారం రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం.. 20 చెక్కు బౌన్స్ కేసులకు ముగింపు

Select Suryaa Now
సూపర్ లోక్ అదాలత్‌లో రూ.59.48 లక్షల కేసుల పరిష్కారం రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం.. 20 చెక్కు బౌన్స్ కేసులకు ముగింపు

సిద్దిపేట ప్రతినిధి ; యస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు నిర్వహించిన సూపర్ లోక్ అదాలత్‌లో సిద్దిపేట జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా చెక్కు చెల్లకపోవడానికి సంబంధించిన చట్టం కింద నమోదైన 20 కేసులను పరిష్కరించి, రూ.59,48,774 మొత్తానికి రాజీ కుదిరినట్లు న్యాయశాఖ అధికారులు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సూపర్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, సంబంధిత అధికారులు పాల్గొని కేసుల పరిష్కారానికి కృషి చేశారు.సూపర్ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా చెక్కు చెల్లకపోవడానికి సంబంధించిన చట్టం కింద నమోదైన కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పరిష్కారం చేయడం ద్వారా న్యాయస్థానాలపై కేసుల భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెందిన న్యాయాధికారులు, సీనియర్ న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలు తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.సూపర్ లోక్ అదాలత్ – ప్రత్యేక లోక్ అదాలత్ఎన్.ఐ. చట్టం (ఎన్ఐ యాక్ట్.)– చెక్కులు, ఇతర నగదు చెల్లింపు పత్రాలకు సంబంధించిన చట్టం.