షాద్నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం....
మాజీ కౌన్సిలర్ ప్రేమలక యుగంధర్ ల ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు...
షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు శ్రీనగర్ కాలనీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో మాజీ కౌన్సిలర్ ప్రేమలత - యుగంధర్ దంపతుల ఆధ్వర్యంలో జమ్మి (శమీ) పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమాన్ ఆలయం నుండి శ్రీ సీతరామచంద్ర స్వామి వారిని పల్లకిలో ఊరేగింపుగా పెద్దమ్మతల్లి గుడి ఆవరణలోని జమ్మి చెట్టు వరకు పల్లకి సేవ నిర్వహించారు .విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న మాజీ కౌన్సిలర్ ప్రేమలత యుగంధర్ లను కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దసరా వేడుకల్లో పాల్గొన్నారు..
నరసింహారెడ్డి మేజర్ న్యూస్