పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధపూజ కార్యక్రమం-*ఆయుధపూజలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్*
సూర్య ఖమ్మం,ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ అర్ముడ్ రిజర్వ్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ శాఖ ఆయుధాలు, వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీకగా నిర్వహించిన పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏ ఆర్ అడిషనల్ డిసిపిలు కుమారస్వామి, విజయబాబు, ఏ ఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, ఎస్బీ ఏసీపీ మహేష్, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శంకర్, అశోక్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ