BREAKING
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

విజయదశమి సందర్భంగా అఖండ అన్న సమారాధన ప్రారంభం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకట శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభం

Select Suryaa Now
విజయదశమి సందర్భంగా అఖండ అన్న సమారాధన ప్రారంభం  కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకట శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభం

భీమవరం, సూర్య న్యూస్:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమవరం 24వ వార్డు రామాయణం సుబ్బన్నవారి తోటలోని గురు భవాని అధికారి వెంకన్న, దుర్గాలక్ష్మి అమ్మవారి దీక్ష పీఠం వద్ద అఖండ అన్న సమారాధనను ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకట శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు, పంచామృత అభిషేకాలు, భజనలు నిర్వహించినట్లు గురుభవాని అధికారి వెంకన్న తెలిపారు. ఆదివారం నిర్వహించిన సామూహిక చండీ హోమం విజయవంతంగా పూర్తయిందన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భవానీలు, భక్తులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

పీఠంలోని భవానీలంతా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని దీక్షను పరిపూర్ణం చేసుకున్నారని లాయర్ వంశీ భవాని పేర్కొన్నారు. అన్న సమారాధనకు ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహకరించిన దాతలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బుధవారం అమ్మవారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భవానీలు, అయ్యప్ప, శివ స్వాములు, ఇతర దీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.