BREAKING
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

విజయదశమి సందర్భంగా ఘనంగా ఆయుధ, వాహన పూజలు పోలీసు శాఖ ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

Select Suryaa Now
విజయదశమి సందర్భంగా ఘనంగా ఆయుధ, వాహన పూజలు  పోలీసు శాఖ ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

భీమవరం, సూర్య న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ, వాహన పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపారు.

మొదట దుర్గాదేవి చిత్రపటానికి, పోలీసు ఆయుధాగారంలోని ఆయుధాలకు ఎస్పీ పూజలు నిర్వహించారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో వినియోగించే పోలీసు శాఖ వాహనాలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు సిబ్బంది అంకితభావంతో, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.వి.వి. సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఇ. ఇందుమతి, ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కె. వరప్రసాద్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.