బండ మాదారంలో అంబరాన్నంటిన విజయదశమి సంబరాలు.. జమ్మి పూజలో పాల్గొన్న వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి
మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం గ్రామంలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ వేడుకల్లో ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి పాల్గొని జమ్మి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.