పులిరామన్నగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా బన్నే పూర్ణ
బుట్టాయిగూడెం, మేజర్ న్యూస్: మండలంలోని పులిరామన్నగూడెం ఎంపీటీసీ స్థానానికి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా బన్నే పూర్ణ పోటీ చేస్తున్నట్లు మాజీ ఎంపీటీసీ సభ్యుడు, న్యాయవాది ఉద్దండం యేసుబాబు తెలిపారు.
పార్టీ అధిష్టానం బన్నే పూర్ణ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిందని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పులిరామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో ఆమె అభ్యర్థిత్వం ప్రాధాన్యత సంతరించుకుంది.
రిపోర్టర్ మధు (నాని)బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా.