BREAKING
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి భీమవరం జెడ్పీటీసీగా కత్తుల సిరి మహాలక్ష్మి, వీరవాసరం ఎంపీపీగా భోగిరెడ్డి శ్రీనివాసరావు

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి  భీమవరం జెడ్పీటీసీగా కత్తుల సిరి మహాలక్ష్మి, వీరవాసరం ఎంపీపీగా భోగిరెడ్డి శ్రీనివాసరావు

భీమవరం సూర్య న్యూస్: రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరంలోని తన కార్యాలయంలో భీమవరం, వీరవాసరం మండలాల కూటమి అభ్యర్థులను ఆయన ప్రకటించారు.

భీమవరం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నాయకుడు కత్తుల నీలేంద్ర సతీమణి కత్తుల సిరి మహాలక్ష్మిని, వీరవాసరం మండల ఎంపీపీ అభ్యర్థిగా జనసేన నాయకుడు భోగిరెడ్డి శ్రీనివాసరావును ప్రకటించారు. కూటమి నేతల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు.

సీట్ల సర్దుబాటులో భాగంగా భీమవరం మండలంలో బీజేపీకి ఒకటి, టీడీపీకి తొమ్మిది, జనసేనకు ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. వీరవాసరం మండలంలో బీజేపీకి ఒకటి, టీడీపీకి ఎనిమిది, జనసేనకు పది ఎంపీటీసీ స్థానాలు కేటాయించినట్లు వెల్లడించారు. భీమవరం జెడ్పీటీసీ, వీరవాసరం ఎంపీపీ స్థానాలను జనసేనకు, భీమవరం ఎంపీపీ, వీరవాసరం జెడ్పీటీసీ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు పేర్కొన్నారు.

కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని అంజిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.