BREAKING
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: కలెక్టర్ నాగరాణి

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం, సూర్య న్యూస్:జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్నికల సన్నద్ధతపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పలు సూచనలు చేశారు.

ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో ఎన్నికల యంత్రాంగంపై నమ్మకం కలిగించేలా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నామినేషన్ల పత్రాలు, ఫారం-ఎ, ఫారం-బి తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులు, నివేదికలను చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆదేశించారు.

ఎన్నికల సమయంలో సున్నితమైన అంశాలను ముందుగానే గుర్తించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమస్యలు తలెత్తిన వెంటనే పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అధికారి తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మాట్లాడుతూ, ఎన్నికల ఏర్పాట్ల పురోగతిని నిరంతరం సమీక్షించుకోవాలని, సిబ్బంది, రికార్డులు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో డి. రమణ, డీపీఓ దోసిరెడ్డి, ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.