BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

--సేవా కార్యక్రమాలకు గుర్తింపు.. కాంగ్రెస్‌లో కీలక పదవి! --జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా గ్రంధి ప్రవీణ్ కుమార్ నియామకం

Select Suryaa Now
--సేవా కార్యక్రమాలకు గుర్తింపు.. కాంగ్రెస్‌లో కీలక పదవి!  --జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా గ్రంధి ప్రవీణ్ కుమార్ నియామకం

వైరా రూరల్ (సూర్య న్యూస్):- అక్టోబర్ 30:;ప్రజాసేవలో చురుకైన పాత్ర.. నిరుపేదలకు ఆపన్నహస్తం.. సామాజిక కార్యక్రమాల్లో నిరంతర భాగస్వామ్యం.. పార్టీ పట్ల నిబద్ధతకు గుర్తింపుగా గ్రంధి ప్రవీణ్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యత లభించింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న గ్రంధి ప్రవీణ్ కుమార్ ఆర్య వైశ్య సమాజ అభ్యున్నతితో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు వ్యక్తిగతంగా అండగా నిలుస్తూ తన సేవాభావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతకు సహకరిస్తూ కార్పొరేషన్ కార్యక్రమాల నిర్వహణలోనూ, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకున్న నాయకత్వం జిల్లా కాంగ్రెస్ వాణిజ్య విభాగ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రంధి ప్రవీణ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని వ్యాపారులు, వాణిజ్య వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధితో పాటు ప్రజాసేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని పేర్కొన్నారు.