సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ!
వలిగొండ: గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించినా.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం మాత్రం యథావిధిగా పాఠశాలను నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలవు దినాన కూడా తరగతులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి పాఠశాల నిర్వహణకు అనుమతి ఎలా లభించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై విద్యాశాఖ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.