BREAKING
సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి...

సీతమ్మలోద్ది చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Select Suryaa Now
సీతమ్మలోద్ది చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాలి  – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 

సూర్య - పెద్దపల్లి: సీతమ్మలోద్ది చారిత్రక ప్రాంత వారసత్వ సంపదను పరిరక్షించి, దాని విశిష్టతను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సీతమ్మలోద్ది ప్రాంతంలో నిర్వహించిన హెరిటేజ్ ట్రెక్కింగ్ కార్యక్రమంలో 560 మందికి పైగా ట్రెక్కర్లు, చిన్నారులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సీతమ్మలోద్ది గుహలో లభించిన సుమారు 10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రైండింగ్ పరికరం (శాడిల్ క్వెర్న్)ను కలెక్టరేట్‌లోని పురావస్తు మ్యూజియంలో కలెక్టర్ భద్రపరిచారు. ఈ పరికరాన్ని ప్రాచీన మానవులు ధాన్యాలు, మొక్కల భాగాలు, వేర్లు, ఖనిజాలను నూరేందుకు ఉపయోగించేవారని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి వివరించారు. ఈ ఆధారాలు అప్పటి మానవుల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు.
సీతమ్మలోద్ది చారిత్రక విశేషాలతో హెరిటేజ్ టేబుల్ బుక్ రూపొందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, పుస్తక రూపకల్పనలో భాగస్వామైన అనిల్‌ను అభినందించారు. చారిత్రక వారసత్వ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి హెరిటేజ్ ట్రెక్కింగ్ దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.