BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ.. పారిశుధ్య పనుల పరిశీలన

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ.. పారిశుధ్య పనుల పరిశీలన

 

చౌటుప్పల్, మేజర్ న్యూస్: పట్టణంలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ భూమిపూజ చేశారు. స్థానిక కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అదే వార్డులో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ భీమా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి పథకం గురించి ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలని, అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు. పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం వార్డులో నిర్వహిస్తున్న పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమం పనులను పరిశీలించారు. కౌన్సిలర్‌తో కలిసి వార్డులో పర్యటించి పారిశుధ్య పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయక్, సూర్కంటి వెంకట్ రెడ్డి, కందాల వెంకట్ రెడ్డి, బోదుల యాదగిరి, పూర్రు శంకర్, ఆరుట్ల గణేష్, హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్, అంజయ్య, శ్యామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.