BREAKING
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

సమాజంలోని చెడును పారద్రోలి, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

Select Suryaa Now
సమాజంలోని చెడును పారద్రోలి, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

 చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ,సమాజంలో చెడును పారద్రోలి, ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.  దుర్గాష్టమి పండుగను పురస్కరించుకుని ఆదివారం జిల్లా సాయుధ దళం (ఏఆర్) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఆయుధ పూజ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు చెందిన ఆయుధాలు, వాహనాలకు ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరం దసరా పండుగను పురస్కరించుకుని ఆయుధ పూజ నిర్వహించడం ఒక గొప్ప సంప్రదాయమని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని  సూచించారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు జగన్, రాఘవరావు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్,  నాగర్ కర్నూల్  క్రైమ్, సూర్య న్యూస్