సహస్ర ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, క్యాంటీన్, డయాలసిస్ విభాగాల ప్రారంభం
సంగారెడ్డి ; సంగారెడ్డి పట్టణంలోని సహస్ర ఆసుపత్రిలో మరో కీలక ముందడుగు పడింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ వార్డు, ఈహెచ్ఎస్ సేవలు, క్యాంటీన్, డయాలసిస్ విభాగాలను ఆసుపత్రి యాజమాన్యం శుక్రవారం ప్రారంభించింది.ఈ విభాగాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ప్రముఖులు హాజరయ్యారు.ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన పేదలకు వైద్య సేవలు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా డయాలసిస్ అవసరమైన రోగులకు ప్రత్యేక సేవలు, రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం క్యాంటీన్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కె. రాజు గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.