రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని తుడుకుర్తి గ్రామానికి చెందిన రామాటి అలివేల (54) ఈనెల 4న రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి ప్రవాహంతో ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మొదట చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సంఘటనకు సంబంధించి మృతురాలి మేనల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
పి. వినయ్ కుమార్ నాగర్ కర్నూల్ క్రైమ్ ,సూర్య న్యూస్: