BREAKING
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేయాలి -- పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పిలుపు

Select Suryaa Now
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేయాలి -- పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పిలుపు

*నారాయణపేట, సూర్యన్యూస్:*   త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పట్టుదలతో పనిచేయాలని, రెండు స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరి చొప్పున ఇన్‌చార్జిలను నియమించి, అర్హులైన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఓటర్ల నమోదుతోపాటు ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసి, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.