BREAKING
ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు..

రెడ్‌క్రాస్‌ సేవలను విస్తృతం చేయాలి

Select Suryaa Now
రెడ్‌క్రాస్‌ సేవలను విస్తృతం చేయాలి
సూర్య, ఆదిలాబాద్‌, అక్టోబరు 29: జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో ఐఆర్‌సీఎస్‌ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.రెడ్‌క్రాస్‌ ద్వారా ప్రజలకు వైద్య సేవలు, రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలను నిరంతరం అందించాలని సూచించారు. నూతన బ్లడ్‌ బ్యాంక్‌ మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సంస్థ నిర్వహణలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. కైలాస్‌నగర్‌ వైట్‌ క్వార్టర్స్‌లో శిథిలావస్థకు చేరిన రెడ్‌క్రాస్‌ భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం లేదా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నూతన భవనం నిర్మించేందుకు అవసరమైన వసతులు కల్పించే అంశాలపై చర్చించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు.సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ఐఆర్‌సీఎస్‌ చైర్మన్‌ ఆడె క్రాంతి కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మనోహర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎన్‌.రాజేశ్వర్‌రావు, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, సభ్యులు పార్థసారథి, రూపేష్‌రెడ్డి, అనిల్‌, సంజయ్‌, విశ్వనాథ్‌, కృష్ణ, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.