BREAKING
సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి

రెడ్‌క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి – జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.

Select Suryaa Now
రెడ్‌క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి – జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవతా దృక్పథంతో సమాజ సేవలో సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతనంగా ఎంపికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులతో కలెక్టర్ సమావేశమై సంస్థ లక్ష్యాలు, విధులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సంస్థ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే గొప్ప మానవతా సేవా సంస్థ అని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించి, అత్యవసర సమయంలో రోగులకు సకాలంలో రక్తం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతను రక్తదానానికి ప్రోత్సహించడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేలా సభ్యులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. పేదలు, అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.అనంతరం.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి కేటాయించాలని ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ఎం. సత్యనారాయణ, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ ఎం.సి. లింగన్న, ట్రెజరర్ అల్లాడి రవి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సమన్పల్లి రాఘవులు, సభ్యులు భూమయ్య, గంగన్న, నాగభూషణం, రాజేశ్వర్, రమేష్, ముజాహిద్, సాయన్న, రవీందర్, చిన్నయ్య, రాజన్న, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.