రైతులు సొసైటీ సెంటర్ లో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలి
సూర్య, సుల్తానాబాద్
రైతులు సొసైటీ సెంటర్లలో వరి ధాన్యాలను అమ్ముకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం మండలంలోని సుద్దాల అల్లిపూర్ గ్రామాలలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ యాసంగిలో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు వైపు మొగ్గు చూపాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సెంటర్లలో వడ్లను అమ్ముకుంటే 24 గంటల్లో వరి ధాన్యం డబ్బులతో పాటు బోనస్ కూడా ప్రభుత్వం వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, అల్లిపూర్ సర్పంచ్ కోదాటి సాయికిరణ్, సింగిల్ విండో చైర్మన్ లు చిలుక సతీష్, భాస్కర్ రెడ్డి, దామోదరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.