BREAKING
స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ గుంటూరు: మురసు తుఫాన్ ఎఫెక్ట్...ఈ మండలాలలో ఎన్నికలకు ఒక్క రోజు బ్రేక్ *ఎడతెరిపి లేని వర్షం.. నీట మునిగిన అశ్వారావుపేట!* పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: నలుగురు యువకులు దుర్మరణం ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీసులో అందించాలి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామలింగం మలేషియాలో తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – షటిల్ స్మాష్ సీజన్ 3 98 మంది విద్యార్థులకు ఒకే బోరు.. తాగునీటికి తిప్పలు!.… ధర్మ తేజ ను మర్యాదపూర్వకంగా కలిసిన, మున్సిపల్ చైర్ పర్సన్. డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె : సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు. ఒంగోలులో కార్పొరేటర్ గా శంకరాపురం వాసి. సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బ్రహ్మసముద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, టిడిపిలోకి సీనియర్ నేత రామచంద్రప్ప. న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు..నగరాభివృద్ధికి కృషి చేస్తా..

నవంబర్ 6న హైదరాబాద్‌లో ధర్నా జయప్రదం చేయాలి...

Select Suryaa Now
నవంబర్ 6న హైదరాబాద్‌లో ధర్నా జయప్రదం చేయాలి...

ఫరూక్నగర్ రంగారెడ్డి;ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 6న హైదరాబాద్‌లోని సీఆర్‌డీ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో ఉపాధి కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం  లింగారెడ్డిగూడ గ్రామంలో ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని ఆయన సందర్శించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ పట్టణ ప్రాంత పేదలకు సైతం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.800 కూలి చెల్లించాలని శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. పట్టణాల విస్తరణ పేరుతో అనేక గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఆయా గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులు రద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామీణ పేదలకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విలీన గ్రామాలతో పాటు పట్టణ ప్రాంత పేదలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ మేట్లు, సాధారణ మేట్ల సేవలను గుర్తించి కనీస వేతనాలు నిర్ణయించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను అర్హులైన మేట్లతో భర్తీ చేయాలని సూచించారు. 

ఆన్‌లైన్ మస్టర్ల విధానం, ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఫొటోలు తీసే నిబంధనలతో కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, వైద్య పెట్టెలు, వేసవి అలవెన్సులు కల్పించాలని కోరారు. చేసిన పనికి వారంవారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 6న  సీఆర్‌డీ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఉపాధి కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీను నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మహేష్, అంజయ్య, అంతయ్య, మన్నెమ్మ, కమలమ్మ, రాములమ్మ, అనిత, లక్ష్మమ్మ, కృష్ణవేణి, మంజుల, కల్పన, భాగ్యమ్మ, లలిత, గీత, అరుణ, యాదమ్మ, మంగమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు..

నరసింహారెడ్డి మేజర్ న్యూస్