పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు వాన కాలం పాట వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ గాడి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమతుల్లా, మార్కెట్ కమిటీ సీఈవో శ్రీనివాసులు, పిఎసిఎస్ సీఈవో నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారు భాస్కర్ ,వెంకట నరసింహారావు, దామోదర్, బుచ్చన్న ,తుకారం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.