BREAKING
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు సంగీత దర్శకుడిగా రవి బస్రూర్.. అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్ నీల్ అధైర్య పడొద్దు.. అనునిత్యం మీ సేవలోనే ఉంటాం - జూపల్లి రమేష్ బాబు* ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. నరేంద్ర కుమార్ బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా.. అద్భుత విజయం సాధించా! నేరాలకు సినిమాలే కారణమంటూ విమర్శించే వారిపై సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండ .. 25 కిలోల రైస్ బ్యాగ్, రూ.1,000 ఆర్థిక సాయం అందజేత వైసీపీకి విజయ కిరీటం హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరల పరుగు హృదయ విదారక సన్నివేశం..*స్మశాన వాటికకు పోటెత్తిన దొంతికుంట వరద.. రెండు శవాలకు అంత్యక్రియలకు అడ్డంకి* రోడ్లపై ధాన్యం ఆరబోస్తే క్రిమినల్ చర్యలు స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ గుంటూరు: మురసు తుఫాన్ ఎఫెక్ట్...ఈ మండలాలలో ఎన్నికలకు ఒక్క రోజు బ్రేక్ *ఎడతెరిపి లేని వర్షం.. నీట మునిగిన అశ్వారావుపేట!*

డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె : సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్

Select Suryaa Now
డిసెంబర్ 15 నుంచి ఆశావర్కర్ల నిరవధిక సమ్మె  :  సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్

మక్తల్ సూర్య న్యూస్  :
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటీయు) రాష్ట్ర  కమిటీ జైన్ యాక్షన్ కమిటీ సిఐటియు, బి ఆర్ టి యు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా   డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు 
సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని కర్ని పి ఎస్ సి  ఆశ వర్కర్ల తో కలిసి తమ న్యాయమైన డిమాండ్ల , సమస్యలు పరిష్కారించాలని పి ఎస్ సి డాక్టర్ శ్వేత  కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవింద్ రాజ్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా పారితోషికం పేరుతో ఆశా కార్యకర్తల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందించడంలో రాత్రింబగళ్ళు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో ఆశా కార్యకర్తలు ముందుండి పని చేశారని, ఆశా కార్యకర్తలకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ గ్లోబల్ లీడర్ గా గుర్తించింది. కానీ మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనీస వేతనం అమలు చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. కనీస  వేతనాలు అమలు చేయాలన్న ఆలోచన  చేయడం లేదన్ని మండిపడ్డారు.న్యాయ పరమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కారమయ్యే దాకా ఈ  సమ్మెలో ఉండడానికి ఆశా కార్యకర్తలు ఐక్యంగా అందరూ సిద్ధపడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  పి ఎస్ సి అధ్యక్షురాలు గోవిందమ్మ,నాగమ్మ,యశోద, అమీనా బేగం, ఇందిరా ఏ సుజాత, లక్ష్మి, పార్వతమ్మ, వెంకటమ్మ, సులోచన, తదితరులు పాల్గొన్నారు.


గోవింద్ , సూర్య రిపోర్టర్ మక్తల్