98 మంది విద్యార్థులకు ఒకే బోరు.. తాగునీటికి తిప్పలు!.…
సూర్య, బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం లోని కుష్ణపల్లి మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పాఠశాలలో 98 మంది విద్యార్థులకు ఒకే బోరు ఉండటంతో మధ్యాహ్న భోజనం అనంతరం చేతులు కడుక్కోవడానికి, తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అదనపు నీటి సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.