న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు..నగరాభివృద్ధికి కృషి చేస్తా..
విజయనగరం : న్యాయమే గెలిచింది... నా భర్త గెలిచాడు.... ఎమ్మెల్యే అదితి మేడం నాపై నమ్మకం ఉంచి తల్లిలా ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చారని...చెడ్డ పేరు రాకుండా పని చేస్తాను.. ....ఇదీ మేయర్ అవనాపు భార్గవి భావోద్వేగ వ్యాఖ్యలు...నగరాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మేయర్ గా నియామక పత్రం అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబివృద్ధి, సంక్షేమం చేపడతానని, రోడ్లు సమస్య పరిష్కారం చేసి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు. తన మామ స్వర్గీయ అవనాపు సూరిబాబు భర్త విజయ్ చేసిన ప్రజాపయోగ కార్యక్రమాలు తనకు ఆశీర్వాదాలు అన్నారు.అలాగే తన విజయానికి కృషి చేసిన వారందరికి పిల్లా విజయ కుమార్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.