రాష్ట్రం దాటినా తప్పించుకోలేకపోయాడు.!
పటాన్‌చెరు: హెరాయిన్ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పటాన్‌చెరు ఎక్సైజ్ ప్రత్యేక బృందం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో అరెస్టు చేసింది. అక్టోబర్ 25న అక్కడికి చేరుకున్న బృందం స్థానిక పోలీసుల సహకారంతో గాలించి పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో సాయిరాం, ఫయాజ్, కానిస్టేబుళ్లు నెహ్రూ, రవికిరణ్, సంజయ్ పాల్గొన్నారు. నవంబర్ 1న సంగారెడ్డి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. బృందం సభ్యులను ఎక్సైజ్ ఉన్నతాధికారులు అభినందించారు.