BREAKING
నిఖిల్ 'స్వయంభు' సినిమా విడుదలపై తీవ్ర అనిశ్చితి: పాన్ ఇండియా చిత్రాల వలసల వల్ల హీరోలకు తప్పని కష్టాలు అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ .

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.... శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

Select Suryaa Now
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.... శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి.


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."చీకటిని పారద్రోలి వెలుగులను నింపే దీపావళి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకనని,  చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు 
దీపావళి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాలుష్యాన్ని తగ్గించే విధంగా పండుగను జరుపుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.