రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
కందుకూరు : దేశ సమైక్యత, శాంతి, అహింస కోసం కృషి చేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఏఐసీసీ కోఆర్డినేటర్ సచిన్ సావంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...రాజీవ్ గాంధీ ఆశయాలు, ఆదర్శాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సమైక్యత, సామరస్యం, శాంతి నెలకొల్పేందుకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్.