BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

ప్రపంచ మార్కెట్ లోకి ములకనూరు బియ్యం

Select Suryaa Now
ప్రపంచ మార్కెట్ లోకి ములకనూరు బియ్యం

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ రైతుల ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ములుకనూరు సహకార సంఘం ముందడుగు వేసింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు దక్షిణ కొరియాలో జరిగిన వ్యాపార ప్రతినిధి బృందం పర్యటనలో సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార పరిశ్రమలు, ఆధునిక ఉత్పత్తి, శుద్ధి, ప్యాకేజింగ్ విధానాలను పరిశీలించారు. ఆహార పరిశ్రమల కేంద్రం, జాతీయ మత్స్య విజ్ఞాన ప్రదర్శనశాల, సియోల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఆహార ప్రదర్శనను సందర్శించారు. ములుకనూరు బియ్యం, విత్తనాల బ్రాండ్లకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు అమెరికా తదితర దేశాలకు బియ్యం ఎగుమతి అవకాశాలను విస్తరిస్తామని ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పర్యటనలో నేర్చుకున్న ఆధునిక పరిజ్ఞానం, ఏర్పడిన వ్యాపార సంబంధాలు తెలంగాణ రైతుల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా