BREAKING
వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ కరణ్ జోహార్ ఆఫీస్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయుష్మాన్ ఖురానా దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన మున్సిపల్ తెదేపా అభ్యర్థులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దహెగాంలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు...... కుక్కల పట్టివేతకు రంగంలోకి వార్డు ప్రజలు పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరినీ కలవడం నా బాధ్యత.. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్! అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి

ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : ప్రజా పాలకులు ఎప్పుడు ప్రజల బాగోగులు మాత్రమే చూడాలి అంటే కానీ ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే వారిని వ్యక్తిగతంగా తీసుకోని  కక్ష సాధింపు చర్యలకు దిగారాదనీ  మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హితవు పలికారు.పదవి అనేది అలంకారప్రాయం కారాదనీ, ఆ పదవికి సరి అయినన్యాయం చేసినపుడే వన్నె వస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడుపుతారా?!లేదా కాలగర్భం లో కలసి పోతారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం 
జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణకు, డంపింగ్ యార్డు సమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినసందర్బంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో మేధావులు, పర్యావరణ వేత్తలు, డంపింగ్ యార్డు బాధితులు పాల్గొన్నారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షత వహించారు. వేదికపై హాజరైన వారినుద్దేశించి ఎంపీ  ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలించాలని చేపట్టిన ఈ పోరులో ప్రాణం పోయిన పర్లేదు అని, రాజి పడేడి లేదని ఆయన స్పష్టం చేశారు.
రాంకీ డబ్బు, పలుకుబడితో కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయడం లేదు.
కంచె చేను మేసినట్టు పాలకులు వ్యవహరిస్తున్నారని ఏడదేవా చేశారు.
ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుందని అన్నారు..
జవహర్ నగర్ లో మొదట నన్ను కదిలించిన సంఘటన.. కుక్కలు ఒక బాబును పీక్కొని తినతం అత్యంత భాధాకరం జిగుప్సాకరం అని తన భాదను వ్యక్తపరిచారు.
రాంకీ సీ.ఎస్.ఆర్. డబ్బులు ఇక్కడ తాగునీరు రోడ్లు ప్రజలకు ఖర్చు చేయకుండా వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారన్నారు..
రాజ్యాంగం ను అపహాస్యం చేసే వారికి ఏం శిక్ష విధించాలి?అని ప్రశ్నినించారు.సిఎం రేవంత్ ను మొదటి సారి కలిసింది జవహర్ నగర్ ప్రజల కోసమే. ప్రశ్నించే గొంతుకను అని చెప్పి అధికారాన్ని చేపట్టావు.. దీనిని పరిష్కారం చేయాలి అని కోరితే.. మీరే మీటింగ్ పెట్టండి అని పెట్టించారు. కానీ చిత్తశుద్ధి లేదు. నాలుగు నెలలు దాటింది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
ఇంకో దగ్గర చెత్త వేయడానికి ప్రజలు ఒప్పుకోరు కాబట్టి జీరో పొల్యూషన్ టెక్నాలజీతో చెత్త డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని సూచించారు.
మహిళలకు గర్భ స్రావాలు అవుతున్నాయి.
-జవహర్ నగర్ చుట్టుపక్కల నరక కూపంగా మారింది.
30 కిలోమీటర్ల రేడియస్ లో కాలుష్యం ఇబ్బంది ఉందని పేరకున్నారు.
ఈ ఏరియా పిల్లలను స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని స్కూల్స్ కూడా చేర్చుకోవడం లేదు.
-డంప్ యార్డు సమస్య గురించి పార్లమెంట్ లో మాట్లాడాను.. కేంద్ర మంత్రి కట్టర్ ని కలిసినం. ఢిల్లీలో కోట్ల టన్నుల చెత్తను రీసైకిల్ చేస్తున్నారు.
చెత్తను ఎలక్ట్రిసిటీ జనరేషన్, బయోగ్యాస్, ఆర్గానిక్ మెన్యూర్ గా చేయవచ్చు.. అలాంటి ప్లాంట్స్ పెట్టండి కోరారు.
-చెత్త ఏరుకునే వాళ్లు మా దగ్గరికి వచ్చారు. రాంకీ సంస్థ చెత్త కూడా ఏరుకొనివ్వకుండా ఆ పని కూడా వాళ్లే చేస్తారట. డబ్బులు సంపాదించుకో కానీ ఇలా సంపాదించకు బోదించారు.
-27 నుండి పాదయాత్ర మొదలు పెడుతున్న.
నేను రాజీపడే ప్రసక్తి లేదు.
బాధితులు ఇంటికి ఒకరు వస్తారు అని భావించి పాదయాత్ర మొదలు పెడుతున్న.తప్పకుండా ప్రభుత్వం దిగివస్తుంది అని భావిస్తున్న.
కేంద్రం నుండి నిధులు తెప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అని అన్నారు.
12 లక్షల కార్ల నుండి ఎంత పొల్యూషన్ వస్తుందో అంత పొల్యూషన్ దీనివల్ల వస్తుంది.
రేవంత్ రెడ్డి దీనిమీద రాజకీయం చేయవద్దు.
కాళేశ్వరం గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పిన కేసీఆర్ ను బోనులో పెట్టాలని తెలంగాణ రైతులను, ప్రజలను బోనులో పెట్టవద్దు. నీళ్లు ఎత్తిపోస్తే ఈ సమస్య వచ్చేది కాదు.
670 టీఎంసీల నీళ్లు కిందకు వెళ్లిపోయాయి. మనకు 150 టి. ఎమ్. సి.  నీళ్ళు అయితే సరిపోయేవి అని అభిప్రాయం పడ్డారు. ఇది ప్రభుత్వం చేయగలిగే పని.
ఒక్క కిలో చెత్త జవహర్ నగర్ కు రానియవద్దు.. ఉన్న చెత్తను కూడా రీసైకిల్ చేయాలి డిమాండ్ చేస్తున్నాను అన్నారు.