BREAKING
వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం నిక్ జోనస్ పోస్ట్ చేసిన క్యూట్ ఫ్యామిలీ మోమెంట్స్.. ప్రియాంక, కూతురు మాల్తీలతో బ్యాక్‌స్టేజ్ హంగామా! అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం! శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం! 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా కోలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన జైలర్ 2.. తొలి ₹700 కోట్ల తమిళ చిత్రంగా రికార్డు! ఆ పిలుపుతో మాకేం సంబంధం....! 'మళయేతుం ముంపే' సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్ కామ్రేడ్ పాషా, నరహరి ఆశయాలను కొనసాగిస్తాం పాషా,నరహరి ఆశయ సాధనకు పోరాడాలి ముంబైలో ఖరీదైన ఫ్లాట్‌ విక్రయించిన టైగర్ ష్రాఫ్ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ కరణ్ జోహార్ ఆఫీస్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయుష్మాన్ ఖురానా దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన మున్సిపల్ తెదేపా అభ్యర్థులు.

రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ

Select Suryaa Now
రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ

 

తలకొండపల్లి, రంగారెడ్డి : 

మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం, ముదిరాజ్ సంఘాలకు సుమారు రూ.25000/- వేల విలువైన వంట సామాగ్రిని మరియు సిలిండర్లు తలకొండపల్లి మాజీ జడ్పిటిసి పద్మ నరసింహ ముదిరాజ్  అందజేశారు. సంఘాల అవసరాలను గుర్తించి వంట సామాగ్రిని అందించడం పట్ల ఆయా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో కుల సంఘాల అభివృద్ధికి, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. వంట సామాగ్రి మరియు సిలిండర్లు సంఘాలకు ఎంతగానో ఉపయోగపడుతాయిని తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సంఘం, ముదిరాజ్ సంఘాల సభ్యులు పద్మ నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు కటికెల మధు యాదవ్, మాజీ ఎంపిటిసి కటికల యాదయ్య, రాంపూర్ చెరువు జనరల్ సెక్రెటరీ చిలుకం శేఖర్, మాజీ టెంపుల్ చైర్మన్ మొక్తాల రాఘవేందర్ గౌడ్, ముదిరాజ్ యువ నాయకులు చప్పిడి శేఖర్, రొయ్యల మహేష్, రొయ్యల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.