ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం ఉదయం 7వ వార్డులో పదిమందికి పైగా దాడి చేసినట్లు వార్డు ప్రజలు తెలిపారు. కుక్కలు తో గాయపడిన వారు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా వ్యాక్సిన్ లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించినట్లు వార్డు ప్రజలు తెలిపారు. అక్షర స్కూల్ పక్కన కుక్కల దాడులు జరుగుతున్నట్లు, ఆ ప్రాంతపు ప్రజలు భయంతో ఉన్నట్లు తెలిపారు మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.