BREAKING
పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరినీ కలవడం నా బాధ్యత.. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్! అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం

రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి

Select Suryaa Now
రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : ఆదివారం రామ్ గోపాల్ పేట్ డివిజన్, సోమసుందరం వీధిలో స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ & యోగ క్షేమం వహామ్యహం* ఆధ్వర్యంలో, సాధురాం ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష మరియు క్యాటరాక్ట్ ఆపరేషన్ శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు మరియు బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కంటి చూపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరమని , ఈ రోజుల్లో చాలా మందికి , ముఖ్యంగా పేదలు , వృద్ధులకు కంటి సమస్యలు వచ్చినా ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదని, అలాంటి వారి కోసం ఇలాంటి ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ _*"సేవా హి సంఘటన్ "*_ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందని , గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో పేదలకు అండగా నిలబడటం, ఆరోగ్య సేవలు అందించడం మన బాధ్యత అని, ఈ శిబిరం ద్వారా వందల మందికి చూపు వెలుగు అందించడం అభినందనీయమని అన్నారు.

 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 485 మందికి పైగా పేద, మధ్య తరగతి ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారికి బిపి, షుగర్ పరీక్షలతో పాటు ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్, కంటి అద్దాలు మరియు టాబ్లెట్లు పంపిణీ చేశారు. అందులో 35 మందికి పైగా కంటి శుక్లాల (క్యాటరాక్ట్) సమస్య ఉన్నవారికి సాధురాం ఐ హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరూ సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాధురాం ఐ హాస్పిటల్ చైర్మన్ హరీష్ సహాని, వారణాసి కృష్ణమూర్తి, కొత్త శాంతన్ కుమార్, వజనాల దయానందరావు, చేపూరి చంద్రప్రకాష్ గుప్తా, సందీప్ వర్మ, ఆకుల విజయ్, పట్టం కిరణ్, గణేష్ గుప్తా మరియు బస్తీవాసులు పాల్గొన్నారు.