BREAKING
పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరినీ కలవడం నా బాధ్యత.. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్! అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం

మౌలాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం బీఆర్ఎస్ విజయమే లక్ష్యం : అమీనుద్ధీన్

Select Suryaa Now
మౌలాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం  బీఆర్ఎస్ విజయమే లక్ష్యం : అమీనుద్ధీన్

మల్కాజిగిరి, మేజర్ న్యూస్: మహబూబ్‌ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఆన్ లైన్ లో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని బీఆర్ఎస్ గ్రేటర్ మాజీ కార్యదర్శి అమీనుద్ధీన్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి ,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ఆదేశాల మేరకు  ఆదివారం మౌలాలిలోని తన కార్యాలయం వద్ద పట్టభద్రుల ఆన్ లైన్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమీనుద్ధీన్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి పట్ట భద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  మౌలాలి డివిజన్ లోని వివిధ కాలనీలలో గల పట్టభద్రులు తమ కార్యాలయానికి వచ్చి, తమ ఓటు నమోదు చేసుకుని, త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్ని కలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకుడు, మౌలాలి డివిజన్ మాజీ అధ్యక్షుడు మోనార్ భాగ్యానంద్ రావు, నవాబ్ తదితరులు పాల్గొన్నారు