BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

పూల పండుగలో పులకించిన రెసిడెన్సి అపార్ట్మెంట్!

Select Suryaa Now
పూల పండుగలో పులకించిన రెసిడెన్సి అపార్ట్మెంట్!

 

రామాయంపేట, ;  తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు రామాయంపేట పట్టణంలోని రెడ్డి కాలనీ విష్ణు రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో ఘనంగా జరిగాయి. అపార్ట్మెంట్ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు ఒకవైపు కనువిందు చేయగా.. మహిళల గొంతుల నుంచి జాలువారిన బతుకమ్మ పాటలు మరోవైపు ఆహ్లాదాన్ని నింపాయి. బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, లయబద్ధంగా అడుగులు వేస్తూ మహిళలు చేసిన సందడి అపార్ట్మెంట్ ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకునేలా చేసింది.
పూలలో ప్రకృతి.. పాటల్లో తెలంగాణ ఆత్మ!బతుకమ్మ అంటే కేవలం పూలను పేర్చి ఆడుకునే పండుగ మాత్రమే కాదు.. తరతరాలుగా వస్తున్న తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక. ఈ వేడుకలో మహిళలు పెద్ద సంఖ్యలో కలిసి పాల్గొంటూ తమ కుటుంబాల మధ్యనే కాకుండా అపార్ట్మెంట్ వాసుల మధ్య కూడా అనుబంధాలను మరింత బలోపేతం చేశారు.
ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలోనూ మన మూలాలను మరిచిపోకుండా సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ వేడుక చాటిచెప్పింది. పూల పండుగలో మహిళల ఆనందం, ఉత్సాహం, ఆప్యాయతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తరతరాలకు అందాలి తెలంగాణ సంస్కృతి!బతుకమ్మ వంటి పండుగలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, భావితరాలకు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని పరిచయం చేస్తాయి. చిన్నారులు, యువతులు పెద్దలతో కలిసి ఈ వేడుకల్లో భాగస్వాములవడం సంప్రదాయ పరిరక్షణకు నిదర్శనంగా నిలిచింది.
సద్దుల బతుకమ్మ వేడుకలతో విష్ణు రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో