BREAKING
ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు లావణ్య వేణి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మైపాల తాతాజీ ఘన నివాళి: మహిళల స్వయం ఉపాధికి ఆరాధ్య ఫౌండేషన్ చేయూత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి నాలుగు ఏకగ్రీవం.. 22 పల్లెల్లో ఎన్నికల సమరం! పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కార్తీక పౌర్ణమి వేడుకల అనంతరం చెత్తకుప్పగా కీసరగుట్ట.. పట్టించుకునేదెవరు? వెంకట్రావుపల్లిలో గ్రానైట్ చోరీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మాచవరం మెట్ల కాలనీలో సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు.. అన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్‌లో కలకలం

Select Suryaa Now
పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్‌లో కలకలం

నిజామాబాద్, సూర్య ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కలకలం రేగింది. సుధాకర్ అనే వ్యక్తి స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అందుతున్న సమాచారం ప్రకారం, సుధాకర్ తన హోటల్ బయట టేబుళ్లు ఏర్పాటు చేయడంపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని చెప్పేందుకు ఆయనను స్టేషన్‌కు పిలిపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మంటల్లో తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను వెంటనే ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు నుంచి ఘటన వరకు జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు టెలీ-మానస్ హెల్ప్‌లైన్ 14416 కు ఉచితంగా కాల్ చేసి సహాయం పొందవచ్చు.)