telangana
పోలీస్ అమరవీరుడి కుటుంబానికి పోలీస్ అధికారుల పరామర్శ - సీఐ జాన్ రెడ్డి
సూర్య బాల్కొండ మెండోరా:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నరసయ్య కుటుంబాన్ని సీఐ జాన్ రెడ్డి, ఎస్సై సువాసిని, పోలీస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా నరసయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని సీఐ జాన్ రెడ్డి హామీ ఇచ్చారు.
దేశం కోసం, విధి నిర్వహణలో పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.