BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

పంచలింగాల రైతు పొలంలో భారీ మొసలి.. తాళ్లతో బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగింత

Select Suryaa Now
పంచలింగాల రైతు పొలంలో భారీ మొసలి.. తాళ్లతో బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగింత
మర్పల్లి, మేజర్ న్యూస్ :మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో భారీ మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. శనివారం రాత్రి గ్రామానికి సమీపంలోని రైతు పొలంలోకి మొసలి ప్రవేశించింది. ఆదివారం ఉదయం తన పొలానికి వెళ్లిన రైతు బందిగ మొగులయ్యకు రేకుల షెడ్డు సమీపంలో మొసలి కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఆయన తోటి రైతులకు సమాచారం అందించగా, పలువురు రైతులు కలిసి మొసలిని తాళ్లతో బంధించారు.అనంతరం పొలం నుంచి మొసలిని కట్టెల సహాయంతో మెయిన్ రోడ్డు వద్దకు తీసుకురావడంతో గ్రామస్తులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకించారు. భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో గ్రామంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.సమాచారం అందుకున్న సంగారెడ్డి మంజీరా అభయారణ్యానికి చెందిన వన్యప్రాణి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బంటారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిషన్ ఆధ్వర్యంలో మొసలిని స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులు సంగారెడ్డికి తరలించారు. మొసలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.