పిల్లల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి – సర్పంచ్ దేవి సింగ్
కొల్చారం;భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా సేవలందించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేవి సింగ్ ఆధ్వర్యంలో చిన్నారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నెహ్రూ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామపంచాయత కార్యదర్శి మౌనిక మాట్లాడుతూ బడిఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన భోజన కార్యక్రమాలను పిల్లలకు నాణ్యతతో, క్రమం తప్పకుండా అందించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సూచించారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ పప్పు, గుడ్డు వంటి ఆహారం అందిస్తున్నప్పటికీ, కొంతమంది పిల్లలకు వేడి చేస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు మహిళలు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్ దేవి సింగ్, పంచాయతీ కార్యదర్శి మౌనిక సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి ఈ విషయంలో తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాయిని వెంకట నరసింహులు, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ, ఆశా వర్కర్ నాయిని నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ నాయిని సత్యనారాయణ, వార్డు సభ్యులు చిత్తారి సంతోష్, భాస్కర్, సింధు, అనసూయ, గొల్ల మధులత, కుమారస్వామి, మండల నాయకులు నాయిని రాయన్న, దాసు రాములు, కొప్పుల యేసు రాజు, మల్టీప