BREAKING
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు చరిత్ర సృష్టించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ: టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్: టెస్టుల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డు నమోదు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్స్ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజానిపై సైబర్ దాడి ట్రెండ్‌కు తగినట్లుగా నిఖిల్ కొత్త రూపం: 'అలియాస్ రుక్మిణి' చిత్రంలో యువ కృష్ణుడిగా అదరగొడుతున్న హీరో గన్నవరం ..గరం..గరం.. రాజాం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాంః మంత్రి పొన్నం

Select Suryaa Now
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాంః మంత్రి పొన్నం

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం సాకారం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో పొన్నం కోమల - సమ్మయ్య ముదిరాజ్ దంపతులకు ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై, నిర్మాణం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన కోమల - సమ్మయ్య దంపతులకు నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇందిరమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..- దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ప్రజా పాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈ దీపావళి పండుగను తమ సొంత ఇందిరమ్మ ఇళ్లలో జరుపుకుంటున్న లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లలో ఈరోజు దీపావళి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.
- 500 గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. మధ్యలో నిలిచిపోయిన మరో 500 ఇళ్లకు, రెండో దశలో అదనంగా 1,000 ఇళ్లకు మంజూరులు లభించాయి. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.
- రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం, పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే ప్రక్రియను పూర్తి చేస్తాం. రూఫ్ లెవల్‌లో ఉన్న లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీలో పూర్తయిన ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ తమ సొంతింట్లో దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరి, ఈరోజు నా అక్కాచెల్లెళ్లు ప్రజా పాలన ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.