పేదల అభ్యున్నతికి పాటు పడిన గొప్ప నాయకురాలు..
బెజ్జంకి ; భారతదేశ తొలి మహిళ ప్రధాని,ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గరీబీ హఠావో నినాదంతో,20సూత్రాల పథకంతో బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన గొప్ప నాయకురాలు అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కత్తి రమేశ్ కొనియాడారు.శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కత్తి రమేశ్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ శ్రేణులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.దేశానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు.ఏఎంసీ వైస్ చైర్మన్ పర్శ సంతోష్,డైరెక్టర్ ఇస్కిల్ల ఐలయ్య,ప్యాక్స్ డైరెక్టర్ రామచంద్రం,యూత్ అధ్యక్షుడు కర్రావుల సందీప్,నాయకులు జెల్ల ప్రభాకర్,బోనగం రమేశ్,బూట్ల చంద్రప్రకాష్,చిలుముల మోహన్,ఐలేని మహేందర్ రెడ్డి,బోనగం శంకర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.(సూర్యన్యూస్,బెజ్జంకి)