BREAKING
సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

పేద కుటుంబానికి అండగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు ఇమామ్

Select Suryaa Now
పేద కుటుంబానికి అండగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు ఇమామ్

సిద్దిపేట అర్బన్,  : ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. పేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో జీవించే మార్గం చూపడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనం. పదవులతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ, కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు ఇమామ్.ఈ క్రమంలో సిద్దిపేట పట్టణంలోని పదో వార్డులో భర్తను కోల్పోయి, చిన్నపిల్లలతో దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద మహిళ కుటుంబానికి అత్తు ఇమామ్ అండగా నిలిచారు. ఆ కుటుంబం ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవనం సాగించాలనే ఉద్దేశంతో తన తరఫున కుట్టు మిషన్‌ను అందజేశారు.కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. ఆ మహిళకు స్వయం ఉపాధి కల్పించి, కుటుంబ పోషణకు మార్గం చూపాలనే మంచి ఆలోచనతో ఈ సహాయం అందించడం అభినందనీయం. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఈ కుట్టు మిషన్ జీవనోపాధికి ఒక ఆధారంగా నిలవనుంది.పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అవసరమైన సమయంలో వారికి అండగా నిలుస్తున్న అత్తు ఇమామ్ సేవా దృక్పథాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.ఆపదలో అండగా నిలిచే మనసు.. పేద కుటుంబానికి ఆత్మగౌరవంతో బతికే భరోసా.. ఇదే నిజమైన ప్రజాసేవకు నిదర్శనం.